బీజేపీ నేతల్లో మార్పు శుభపరిణామం: సబ్బంహరి | Good evolution in changes of BJP leaders, says Sabbam Hari | Sakshi
Sakshi News home page

బీజేపీ నేతల్లో మార్పు శుభపరిణామం: సబ్బంహరి

Jan 20 2014 3:13 AM | Updated on Aug 15 2018 2:14 PM

బీజేపీలో మార్పు శుభపరిణా మని అనకాపల్లి ఎంపీ సబ్బంహరి అన్నారు. విశాఖలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు.

సాక్షి,విశాఖపట్నం: బీజేపీలో మార్పు శుభపరిణా మని అనకాపల్లి ఎంపీ సబ్బంహరి అన్నారు. విశాఖలో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు.  ఎన్నికల ముందు అన్ని పార్టీలూ రాజకీయలబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. యూపీఏకు పార్లమెంటులో మెజార్టీ లేదు. బిల్లుపై నిర్ణయం తీసుకునే బలం లేదు.  బీజేపీ మద్దతిస్తుం దనే నమ్మకంతో యూపీఏ తెలంగాణపై ముందకెళుతోందన్నారు. అయితే బీజేపీ వైఖరి  తాజాగా ఆ పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్‌తో తేలిపోయిందని, ఆ పార్టీ నేతలు రాజ్‌నాథ్‌సింగ్, నరేంద్రమోడి కూడా ఈ విభజన ప్రతిపాదనలు రాజకీయ లబ్ధికోసమే చేశారని అంగీకరించారని చెప్పారు.
 
 ఇదే సమావేశంలో వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై పలు విమర్శలు చేశారు. తన దిష్టిబొమ్మలు తగుల బెట్టడం వంటివి చేస్తున్నారని, తాను కూడా ఆ పని చేయగలనని సబ్బం అన్నారు. ‘దిష్టిబొమ్మలు తగులబెట్టే కార్యక్రమాన్ని ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చేస్తాను. 175 నియోజకవర్గాల్లో నీ దిష్టి బొమ్మలు తగలబెడతాను’ అని ఆయన పేర్కొన్నారు. ప్రెస్‌మీట్ పెట్టి ఎవరిపైనైనా చెడుమాట్లాడే అలవాటు తనకు లేదంటూనే ఆయన విమర్శలు కొనసాగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement