గోదారమ్మకు ఘన నీరాజనం | Godavari Awards at rajahmundry | Sakshi
Sakshi News home page

గోదారమ్మకు ఘన నీరాజనం

Nov 7 2014 1:52 AM | Updated on Aug 20 2018 8:20 PM

గోదారమ్మకు ఘన నీరాజనం - Sakshi

గోదారమ్మకు ఘన నీరాజనం

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అఖండ గోదావరి నదికి అపురూప హారతులిచ్చారు.

నిష్ణాతులకు గోదావరి పురస్కారాలు
సాక్షి, రాజమండ్రి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని అఖండ గోదావరి నదికి అపురూప హారతులిచ్చారు. బుద్ధవరపు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం రాత్రి రాజమండ్రిలోని పుష్కరాల రేవులో పున్నమి హారతుల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే వివిధ రంగాలకు చెందిన ఐదుగురు ప్రముఖులకు గోదావరి పురస్కారాలు అందజేశారు.

ఈ పురస్కారాల ఎంపిక కమిటీ చైర్మన్‌గా ‘సాక్షి’ దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్(ఈడీ) కె. రామచంద్రమూర్తి వ్యవహరించారు. ఈ సంద ర్భంగా ప్రసిద్ధ దర్శకుడు ఎల్‌వీ ప్రసాద్ మనుమడు, నిర్మాత అయిన రవిశంకర్ ప్రసాద్ స్మారక అవార్డును జర్నలిజం, సామాజిక సేవారంగాల విభాగంలో ప్రముఖ పాత్రికేయుడు మల్లేపల్లి లక్ష్మయ్యలకు అవార్డులు అందజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement