8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇబ్రహీంపట్నం (కృష్ణా జిల్లా) : 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శనివారం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చేతనకొండ గ్రామంలోని ఇమ్మానుయేల్ హైస్కూల్ హాస్టల్‌లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కంచికచర్ల మండలానికి చెందిన సాయిరూప(13) చేతనకొండలోని ఇమ్మానుయేల్ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతుంది.
కాగా శనివారం హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన ప్రిన్స్‌పాల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాలిక మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అయితే బాలిక మృతికి గత కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.