నెహ్రూ ఫార్మా సిటీలో మరో ప్రమాదం

Gas Leakage Mishap in Nehru Pharma City - Sakshi

సాక్షి, విశాఖపట్నం: నగరంలోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలో మరో ప్రమాదం సంభవించింది. స్మైలెక్స్‌ ఫార్మా సంస్థలో విషవాయువులు పీల్చి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదకరమైన ట్రైఫోజెన్ గ్యాస్ లీకవ్వడంతో వాటిని ఇద్దరు కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తోంది. జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మా సిటీలో వరుసగా ఇది రెండో ప్రమాద ఘటన. జేఎన్‌ ఫార్మాసిటీలోని విజయశ్రీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరి పరి స్థితి విషమంగా ఉన్న సంగతి తెలిసిందే. విజయ్‌శ్రీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలోనూ విషవాయువుల కారణంగా ఈ ప్రమాదం జరిగింది. మొత్తంగా ఈ ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందగా, ఆరుగురు గాయపడ్డారు. ఫార్మా కంపెనీలు నాసిరకం మాస్కులు ఇస్తుండటంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని, విషవాయువుల వల్ల ప్రాణాలు పోతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలపై పరవాడ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top