ఆరుగురు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్ | Ganja smugglers arrested in visakhapatnam district | Sakshi
Sakshi News home page

ఆరుగురు గంజాయి స్మగ్లర్లు అరెస్ట్

Jun 28 2015 12:53 PM | Updated on Aug 20 2018 4:44 PM

విశాఖపట్నం జిల్లాలో అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టును పోలీసులు ఆదివారం రట్టు చేశారు.

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టును పోలీసులు ఆదివారం రట్టు చేశారు. ముఠాకు చెందిన ఆరుగురు సభ్యులను పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 410 కేజీల గంజాయితోపాటు ఆటో, బైక్,  7 సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యుల్లో ఇద్దరు తమిళనాడు వాసులని పోలీసులు వెల్లడించారు. ఒడిశా వాసులు కూడా ఉన్నారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement