వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం | ganja seized in east godavari district | Sakshi
Sakshi News home page

వెయ్యి కిలోల గంజాయి స్వాధీనం

Jun 12 2016 12:29 PM | Updated on Sep 4 2017 2:20 AM

తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు జంక్షన్ వద్ద పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు.

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం వేటుకూరు జంక్షన్ వద్ద పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1005 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి.. ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి చెందిన రెండు లారీలు, ఓ కారు, నాలుగు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారని పోలీసులకు సమాచారం  అందింది. దీంతో పోలీసులు  తనిఖీలు నిర్వహించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement