బ్యాంకు అకౌంట్లు నిలిపేయడం దారుణం: గంటా | Sakshi
Sakshi News home page

బ్యాంకు అకౌంట్లు నిలిపేయడం దారుణం: గంటా

Published Sat, Jan 10 2015 6:04 PM

freezing of  bank accounts is anarchy: says ganta

విశాఖపట్నం: ఏపీ ఉన్నత విద్యామండలి బ్యాంకు అకౌంట్లు నిలిపివేయడం దారుణమని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. కేసీఆర్ కు అభివృద్ధికంటే వివాదాలంటేనే ఇష్టమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా అన్నింటినీ అంగీకరిస్తున్నామన్నారు. అయినా తెలంగాణ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఏది ఏమైనా ముందుగా ప్రకటించిన తేదీలోనే ఎంసెట్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఐఐఎమ్ కు గంభీరంలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. భూములు నష్టపోయిన రైతులకు సరైన పరిహారం అందిస్తామన్నారు. ఆర్టీఏ డ్రైవింగ్ ట్రాక్ ను వేరొక చోటుకు తరలిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement