ఉద్దానం కిడ్నీ బాధితులకు తీపి కబురు 

Free RTC Services For Uddanam Kidney Patients - Sakshi

ఆర్టీసీ బస్సుల్లో కిడ్నీ బాధితులకు ఉచిత రవాణా సేవలు

ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న బాధిత కుటుంబాలు

కవిటి: ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధితులకు ప్రభు త్వం ఓ తీపి కబురు అందించింది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తూ నిర్ణ యం తీసుకుంది. ఇప్పటికే ప్రయాణ ఖర్చులు తడిసి మోపెడవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం బాధిత కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుంది. జిల్లాలోని 38 మండలాల పరిధిలో 2856 మంది కిడ్నీవ్యాధిగ్రస్తులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించనున్నారు. దీనివల్ల జిల్లాలోని ఆ రు ప్రభుత్వ ఆస్పత్రుల్లోని డయాలసిస్‌ రోగులకు ఉచిత ప్రయాణసేవలు అందనున్నాయి. వీటితో పాటు సీరం క్రియేటినైన్‌ పరిమితికి మించి ఉండి కిడ్నీవ్యాధి ముప్పు అధికంగా ఉన్నవా రుకూడా నిపుణులైన వైద్యుల సాయం తీసుకునేందుకు విశాఖపట్నం తదితర సుదూర ప్రాంతాలకు ఆరీ్టసీల్లో ఉచిత ప్రయాణానికి వీలు కలుగుతుంది. 

కిడ్నీ బాధితులకు సాయం 
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే డయాలసిస్‌ చేయించుకుంటున్న రోగులకు నెల కు రూ.10,000 పెన్షన్‌ అందించడం బాధిత కు టుంబాలకు అత్యంత సంతోషానిచ్చింది. అనంతర కాలంలో సీరం క్రియేటినైన్‌ 5 కు మించి ఉ న్న బాధితులకు కూడా నెలకు రూ.5000 పెన్షన్, నికంగా డయాలసిస్‌ కేంద్రాలకు వెళ్లేందుకు ఉచి త అంబులెన్స్‌ సేవలతో పాటు తాజాగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం నిర్ణయం తీసుకోవడంతో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని స్థానికులు వేనోళ్ల కీర్తిస్తున్నారు. 

సీఎం జగన్‌ ఆపద్బాంధవుడు 
వైఎస్‌ జగన్‌ మా వద్దకు వచ్చి కష్టాలు తెలుసుకున్నా రు. ఆనాడు ఇచ్చిన హామీ మేరకు మాకు చెప్పినవన్నీ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో పడుతున్న కష్టాలను తొలగించేలా కిడ్నీవ్యాధిగ్రస్తులకు ఊరట నిచ్చేవిధంగా ఆదుకున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి ఉచితంగా పాస్‌లు అందించే నిర్ణయం సంతోషం కలిగిస్తోంది. 
– నర్తు తరిణమ్మ, కొండిపుట్టుగ, కిడ్నీ బాధితురాలు, కవిటి మండలం  

ఆదేశాలు అందిన వెంటనే చర్యలు 
కిడ్నీవ్యాధిగ్రస్తులకు ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగా శాఖాపరమైన ఆదేశాలు వచ్చిన వెంటనే నిబంధనల మేరకు బాధితులకు సేవలందించేందుకు చర్యలు తీసుకుంటాం.
– అంధవరపు అప్పలరాజు, రీజనల్‌ మేనేజర్, శ్రీకాకుళం.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top