నలుగురు దోపిడీ దొంగల అరెస్టు | Four Thieves arrested for robbery | Sakshi
Sakshi News home page

నలుగురు దోపిడీ దొంగల అరెస్టు

Nov 8 2014 5:20 AM | Updated on Oct 9 2018 4:55 PM

నలుగురు దోపిడీ దొంగల అరెస్టు - Sakshi

నలుగురు దోపిడీ దొంగల అరెస్టు

స్థానిక ఆంధ్రా యూనివర్సిటీ స్టడీ సర్కిల్ సమీపంలోని తోటలో ఓ వ్యక్తి వద్ద నుంచి 20 లక్షలు దోచుకుని ఉడాయించిన వ్యక్తులను అరెస్టు చేసినట్లు విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్ పేర్కొన్నారు.

విజయనగరం క్రైం: స్థానిక ఆంధ్రా యూ నివర్సిటీ స్టడీ సర్కిల్ సమీపంలోని తోట లో ఓ వ్యక్తి వద్ద నుంచి 20 లక్షలు దోచుకుని ఉడాయించిన వ్యక్తులను అ రెస్టు చేసినట్లు విజయనగరం డీఎస్పీ ఎస్.శ్రీనివాస్ పేర్కొన్నారు. ఒకటో ప ట్టణ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెల 29న పట్టణంలోని గాజులరేగ సమీపంలోని మామిడితోటలో హైదరాబాద్ లక్డీకపూల్‌కు చెందిన కొనిశెట్టి సుబ్బారావు సొత్తు 20 లక్షలను కొందరు వ్యక్తులు దోచుకువెళ్లారని తెలిపారు.

సుబ్బారావుకు విజయవాడకు చెందిన మీనా శివ అనే మధ్యవర్తి... జగదీష్ అనే వ్యక్తి వద్ద తక్కువ ధరకు బంగారం ఉందని చెప్పి, రూ.20లక్షలు తేవాలని ఆశ పెట్టాడని, దీంతో ఈ నెల 29న గాజులరేగ మామిడితోట వద్దకు సుబ్బారావుతోపాటు శి వ, గుమ్మలక్ష్మీపురం మండలం రెళ్ల గ్రా మానికి చెందిన గంటా జగదీష్ అలి యాస్ జగన్ చేరుకున్నట్లు పేర్కొన్నారు. బంగారం విషయం మాట్లాడుకుందామనే సమయానికి ముందే పక్కా ప్ర ణాళికతో ఉన్న బొబ్బిలికి చెందిన యాగిరెడ్డి చిట్టినాయుడు, కాటవీధికి చెందిన రియాజ్, కాటవీధికి చెందిన పొందూరి బాబ్జి, కోరాడ వీధికి చెందిన  ఇస్మాయిల్, సీతానగరం మండలం పులిగు మ్మి గ్రామానికి చెందిన వెంకటరమణ, పార్వతీపురానికి చెందిన కౌసల్య ప్రసాద్‌లు తోటలోకి వచ్చి సుబ్బారావు, శివలను కొట్టి రూ. 20లక్షల నగదును దోచుకెళ్లారన్నారు.

వీరి వెనుకనే జగదీష్ పా రిపోయాడని తెలిపారు. సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక టీం ను ఏర్పాటు చేశామన్నారు. శుక్రవారం రైల్వే స్టేషన్ వద్ద గంటా జగదీష్ అలి యాస్ జగన్‌ను పట్టుకుని అతడి వద్దను న్న రూ.15,13,100, యాగిరెడ్డి చిట్టినాయుడును పట్టుకుని నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాబ్జిని పట్టుకుని *12,200, ఇస్మాయిల్‌ను పట్టుకుని *11,700 స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ముగ్గురు పరారీలో ఉన్నారని, వారిని కూడా పట్టుకుని సొమ్ము స్వాధీ నం చేసుకుంటామని తెలిపారు. కౌసల్య ప్రసాద్, చిట్టినాయుడు పాత నేరస్తులని తెలిపారు. వీరిపై పోలీస్‌స్టేషన్‌లలో కేసులు ఉన్నాయని చెప్పారు. వీరిపై రౌ డీషీట్లు ఓపెన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. సుబ్బారావు అత్యాశకు వెళ్లడం వల్లనే ఇది జరిగిందన్నారు. జగదీష్ బంగారం పూత పూసిన బిస్కట్లు తెచ్చి మోసం చేయడానికి ప్రయత్నించారని వివరించా రు. ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా ఉం డాలని సూచించారు. సమావేశంలో వన్‌టౌన్ సీఐ కె.రామారావు, టూటౌన్ ఎస్‌ఐలు శ్రీధర్,  కృష్ణకిషోర్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement