కారు ఢీకొని నలుగురు తిరుమల భక్తుల మృతి | four piligrims die as car hit them | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని నలుగురు తిరుమల భక్తుల మృతి

Mar 13 2014 7:52 AM | Updated on Sep 2 2017 4:40 AM

చిత్తూరు జిల్లా పాకాల మండలం బైలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.

చిత్తూరు జిల్లా పాకాల మండలం బైలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శనానికని బయల్దేరి వెళ్తున్న భక్తులపైకి ఓ కారు దూసుకెళ్లింది.

దీంతో తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి ప్రాంతానికి చెందిన నలుగురు భక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement