నీట మునిగి నలుగురు చిన్నారుల మృతి | four kids drown in canal at ramapuram | Sakshi
Sakshi News home page

నీట మునిగి నలుగురు చిన్నారుల మృతి

Oct 19 2014 5:55 PM | Updated on Sep 2 2017 3:06 PM

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం అక్కయ్యపాలెం పంచాయతీ పరిధిలోని రామాపురంలో విషాదం చోటుచేసుకుంది.

వేటపాలెం: ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం అక్కయ్యపాలెం పంచాయతీ పరిధిలోని రామాపురంలో విషాదం చోటుచేసుకుంది. వాగులో పడి నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈతకు వెళ్లి నీటిలో ముగినిపోయి చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు ఉన్నారు.

మృతులు వావెల సుజాత(9), రాముడు(10), అంజమ్మ(7), ఆంజనేయులు(9)గా గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. చిన్నారులు మృతిని తట్టుకోలేక వాళ్ల అమ్మమ్మ  నాగమ్మ కూడా ప్రాణాలు కోల్పోయింది. దీంతో రామాపురంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement