కారు బోల్తా: నలుగురికి గాయాలు | four injured in car accident | Sakshi
Sakshi News home page

కారు బోల్తా: నలుగురికి గాయాలు

Jun 7 2015 1:23 PM | Updated on Aug 14 2018 3:22 PM

వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది.

ఓర్వకల్లు (కర్నూలు జిల్లా): వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఈ సంఘటన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. వివరాలు.. నంద్యాల నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని వైద్యం కోసం ఓర్వకల్లు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement