తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ దేవీపట్నం మండలం కొండమొదలు సమీపంలో కలప తనిఖీలకు వెళ్లిన దాదాపు 20 మంది అటవీ సిబ్బంది అదృశ్యం అయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో సంచలనం చోటుచేసుకుంది. ఏజెన్సీ ప్రాంతంలోని దేవీపట్నం మండలం కొండమొదలు సమీపంలో కలప తనిఖీలకు వెళ్లిన దాదాపు 20 మంది అటవీ సిబ్బంది అదృశ్యం అయ్యారు.
వారు తనిఖీలకు వెళ్లి ఇప్పటికే దాదాపు 36 గంటలు గడిచిపోయింది. కానీ ఇంతవరకు వారు ఎక్కడున్నారన్న విషయం మాత్రం తెలియరాలేదు. దీంతో వారి కుటుంబాలతో పాటు అటవీ సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. వీరంతా ప్రస్తుతం గిరిజనుల అదుపులో ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.