బాణసంచా ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య | Five people died in the Fireworks explosion | Sakshi
Sakshi News home page

బాణసంచా ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య

Jan 2 2017 2:19 AM | Updated on Sep 13 2018 5:25 PM

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని పెన్నానది పొర్లుకట్ట ప్రాంతంలో శనివారం జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది.

చికిత్స పొందుతున్న ఇద్దరి మృతి

నెల్లూరు (క్రైమ్‌): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని పెన్నానది పొర్లుకట్ట ప్రాంతంలో శనివారం జరిగిన బాణసంచా పేలుడు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. గాయపడి చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు ఆదివారం మృతిచెందారు. ప్రమాదం జరిగిన తరువాత కనిపించకుండాపోయిన యువకుడు రమేశ్‌ శరీర భాగాలను ప్రమాదస్థలంలో పోలీసులు గుర్తించారు.

ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నాగరాజు, లక్ష్మయ్య మృతిచెందగా తీవ్రంగా గాయపడిన 14 మందిని నెల్లూరు నారాయణ ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. చికిత్స పొందుతున్న వారిలో చౌటూరు శ్రీకాంత్‌ (20), కాకి పోలయ్య (35) మృతిచెందారు. చికిత్స పొందుతున్న 12 మంది పరిస్థితి విషమంగానే ఉంది. వారిలో ఒకరు మినహా అందరూ 80 శాతం కాలినగాయాలతో బాధపడుతున్నారు. బాధితుల కుటుంబసభ్యుల రోదనలు ఆస్పత్రిలో అందరి కంట తడిపెట్టిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement