మత్స్యకారుల ఆచూకి గల్లంతు? | Fishermans missed went for fishing | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల ఆచూకి గల్లంతు?

Jun 22 2015 2:58 AM | Updated on Sep 3 2017 4:08 AM

మత్స్యకారుల ఆచూకి గల్లంతు?

మత్స్యకారుల ఆచూకి గల్లంతు?

చేపలవేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారుల ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు...

- యలమంచిలి సీఐకు బంధువుల ఫిర్యాదు
యలమంచిలి :
చేపలవేటకు వెళ్లిన ఇద్దరు మత్స్యకారుల ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆది వారం  పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ప్రకాశం జిల్లా చీరాల నుంచి సముద్రమార్గంలో బోటు పై ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెంకు చెందిన మైలపల్లి కాశీరావు, మైలపల్లి కోటయ్య ఈ నెల 19న బయలుదేరారు.  శనివారం ఉదయానికే స్వగ్రామానికి చేరుకోవాలి.

మచిలీపట్నం తీరానికి వచ్చే వరకు వారు ఫోన్‌లో మాట్లాడారని, అప్పటి నుంచి సమాచారం లేకుండా పోయిం దని  కుటుంబ సభ్యులు ఆదివారం యలమంచిలి సీఐ కె.వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. ఆయన ఈ విషయాన్ని పెంటకోట, కాకినాడ మెరైన్ పోలీస్టేషన్లు, జిల్లా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామానికి చెందిన కాశీరావు, కోటయ్య నెల రోజుల క్రితం చేపల వేటకు ప్రకాశం జిల్లా చీరాల వెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం ఉదయం 7 గంటలకు బోటుపై బంగారమ్మపాలెం బయలుదేరారు. ఆదివారం వరకు రాకపోవడంతో కుటుంబీకు ల్లో ఆందోళన ఎక్కువైంది.  ఆదివారం రాత్రి వరకు మత్స్యకారుల ఆచూకి తెలియకపోవడంతో సంబంధిత కుటుంబీకు లు, బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement