ఏపీలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు | First Coronavirus Case Detected In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు

Mar 12 2020 4:26 PM | Updated on Mar 12 2020 4:52 PM

First Coronavirus Case Detected In Andhra Pradesh - Sakshi

సాక్షి, నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లో తొలి కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసు నమోదైంది. నెల్లూరు ప్రభుత్వ  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి కరోనా సోకినట్టు వైద్య, ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. ఈ నెల 6న ఇటలీ నుంచి నెల్లూరుకు వచ్చిన వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండటంతో అతన్ని నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. తిరుపతి స్విమ్స్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో అతని నుంచి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించగా కరోనా సోకినట్టు తేలింది. 

ప్రస్తుతం కరోనా సోకిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. 14 రోజుల చికిత్స తర్వాత మరోసారి అతనికి కరోనా వైరస్‌ పరీక్షలు నిర్వహించి.. నెగిటివ్‌గా తేలిన తర్వాత డిశ్చార్జ్‌ చేస్తామన్నారు. అలాగే కరోనా సోకిన వ్యక్తి నెల్లూరుకు వచ్చాక అతనితో సన్నిహితంగా ఉన్న ఐదుగురు వ్యక్తులను కూడా ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. మరోవైపు దేశంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 73కు చేరింది.

చదవండి : రికార్డు స్థాయి క్రికెట్‌ మ్యాచ్‌కు కరోనా బాధితుడు

‘కరోనా వ్యాప్తి ఆందోళనకరమే’

Advertisement
 
Advertisement
Advertisement