ఫ్రూట్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం | Fire accident occur at fruit market in warangal district due to short circuit | Sakshi
Sakshi News home page

ఫ్రూట్ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం

Published Fri, Feb 7 2014 8:43 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

వరంగల్ జిల్లా లక్ష్మిపురంలోని పండ్ల మార్కెట్లో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

వరంగల్ జిల్లా లక్ష్మిపురంలోని పండ్ల మార్కెట్లో గురువారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఎనిమిది పండ్ల దుకాణాలు పూర్తిగా దగ్ధమైయ్యాయి. పండ్ల దుకాణాలలోని గడ్డి, చెక్కపెట్టెల వల్ల అగ్రికీలలు భారీగా ఎగసిపడ్డాయి. దాంతో స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

 

అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఆ అగ్నిప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు వెల్లడించారు. అగ్నిప్రమాదం వల్ల దాదాపు రూ. 25 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని దుకాణదారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement