అర్ధరాత్రి అగ్ని ప్రమాదం | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి అగ్ని ప్రమాదం

Published Thu, Jan 18 2018 6:59 AM

Fire accident in Midnight at Vizianagaram

విజయనగరం టౌన్‌: అర్ధరాత్రి దాటిన తర్వాత అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.  కంప్యూటరైజడ్‌ వుడ్‌ డిజైన్‌కి సంబంధించిన మెషీన్‌ ఆన్‌లో ఉంచేయడంతో షార్ట్‌ సర్క్యూట్‌ అయింది.  దీని ప్రభావంతో   షాపుతో పాటు పక్కనే ఉన్న రెండు కర్రల డిపోలు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది  సకాలంలో స్పందించడంతో  స్థానికుల సహకారంతో మంటలను అదుపు చేయగలిగారు.  పట్టణ అగ్నిమాపక అధికారి దిలీప్‌ కుమార్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి. 

స్థానిక మంగళవీధిలో కర్రల మార్కెట్‌ వద్ద  మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత  2 గంటల ప్రాంతంలో  అదే ప్రదేశంలో ఉన్న  కంప్యూటరైజడ్‌ వుడ్‌  డిజైన్‌ మెషీన్‌ను ఆన్‌లో ఉంచేయడం వల్ల ఆ షాపులో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. దీంతో షాపు పూర్తిగా దగ్ధమై, పక్కనే ఉన్న  కర్రల డిపోలకు మంటలు తాకాయి. డిపోలో అధిక సంఖ్యలో కర్ర ఉండటం వల్ల రెండు డిపోల్లో ఉన్న కర్రలు కాలి బూడిదయ్యాయి. అక్కడే ఉన్న రెండు పూరిళ్లు మంటల ప్రభావానికి కాలి బూడిదయ్యాయి.

  ఈ ప్రమాదంలో సుమారు రూ.8 లక్షలకు పైబడి ఆస్తినష్టం  సంభవించి ఉంటుందని అంచనా వేశారు.  సకాలంలో స్ధానికులు  గుర్తించి, సమాచారాన్ని అందించారు.  స్పందించి సకాలంలో వచ్చిన ఫైర్‌ సిబ్బందికి స్థానికులు సహకారమందించారు.   రెస్క్యూ టీమ్,  అగ్నిమాపకాధికారి  మాధవనాయుడు  ఆధ్వర్యంలో ఫైర్‌ సిబ్బంది  మంటలను అదుపుచేశారు. 

Advertisement
Advertisement