విశాఖపట్నంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
భయాందోళనకు గురైన ఉద్యోగులు షోరూమ్ నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.