పాపవినాశనం వద్ద అగ్ని ప్రమాదం | Fire accident in Tirumala | Sakshi
Sakshi News home page

పాపవినాశనం వద్ద అగ్ని ప్రమాదం

Jun 15 2014 8:24 AM | Updated on Sep 5 2018 9:45 PM

తిరుమలలోని పాపవినాశనం వద్ద ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది.

తిరుమలలోని పాపవినాశనం వద్ద దుకాణ సముదాయంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక శాఖ శకటాలు, సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement