విజయనగరం జిల్లా సాలూరులోని పెద్ద బజార్‌లో ఉన్న ఓ గోనె సంచుల గోదాములో శనివారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.
సాలూరు : విజయనగరం జిల్లా సాలూరులోని పెద్ద బజార్‌లో ఉన్న ఓ గోనె సంచుల గోదాములో శనివారం అర్ధరాత్రి సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాచర్ల ఈశ్వరరావుకు చెందిన గోదాములో మంటలు ఎగసిపడ్డాయి. అయితే స్థానిక అగ్నిమాపక సిబ్బంది జన్ని వీధిలో వేరొక అగ్ని ప్రమాదం సమాచారంతో అక్కడికి వెళ్లగా... బాడంగి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో రూ.1.50 లక్షల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా.
కాగా, సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర ఆదివారం ఉదయం అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించారు. జన్ని వీధిలో రెండు పూరిళ్లు దగ్ధం కాగా, బాధితులు వాసంశెట్టి మహేశ్, రాము కుటుంబ సభ్యులకు తగిన సాయం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అలాగే. పెద్ద బజార్‌లో అగ్ని ప్రమాదం జరిగిన గోదామును కూడా పరిశీలించారు.