అగ్నిప్రమాదంలో రూ.20 లక్షల ఆస్తి నష్టం | fire accident in east godavari district due to short circuit | Sakshi
Sakshi News home page

అగ్నిప్రమాదంలో రూ.20 లక్షల ఆస్తి నష్టం

Mar 3 2016 8:28 AM | Updated on Sep 5 2018 9:45 PM

తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.

పి.గన్నవరం: తూర్పుగోదావరి జిల్లాలో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పి.గన్నవరం మండలం గొందిపాలెంలో ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించాయి. దీంతో పక్కన ఉన్న మరో ఆరు ఇళ్లు, 50 కొబ్బరి చెట్లు  పూర్తిగా కాలిపోయాయి. సుమారు రూ.20 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. బాధితులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement