భీమవరంలో అగ్నిప్రమాదం | Fire accident in Bheemavaram | Sakshi
Sakshi News home page

భీమవరంలో అగ్నిప్రమాదం

Jul 1 2015 9:20 PM | Updated on Sep 5 2018 9:45 PM

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ఫ్లైఓవర్ కింద బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని ఫ్లైఓవర్ కింద బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది పూరిళ్లు దగ్ధం కాగా, ఓ మినీ లారీ కూడా పాక్షికంగా దెబ్బతిన్నది. ఫ్లైఓవర్ కింద పది కుటుంబాలు గుడిసెల్లో నివసిస్తున్నారు. కట్టెల పొయ్యి నుంచి నిప్పు రవ్వలు ఎగసి పడడంతో అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement