ఈ-బిడ్డింగ్ విధానం అమలుతో తాము ఇబ్బందులు పడతామంటూ అనంతపురం రైతులు ఆందోళనకు దిగారు.
ఈ-బిడ్డింగ్ విధానం అమలుతో తాము ఇబ్బందులు పడతామంటూ అనంతపురం రైతులు ఆందోళనకు దిగారు. వ్యవసాయ మార్కెట్లలో రైతుల ఉత్పత్తులను ఈబిడ్డింగ్ ద్వారా విక్రయించాలని ప్రభుత్వ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు హిందూపురం మార్కెట్ యార్డులో మంగళవారం అధికారులు కొనుగోళ్లు ప్రారంభించేందుకు యత్నించారు. అయితే, నూతన విధానం అమలైతే తాము విక్రయించిన ఉత్పత్తులకు వెంటనే చెల్లింపులు పూర్తి కావని, కనీసం ఒక్క రోజు డబ్బుల కోసం ఎదురుచూడాల్సి ఉంటుందని రైతులు అడ్డుకున్నారు. అధికారులు అడిగిన అన్ని వివరాలను సమర్పిస్తేనే కొత్త విధానంలో విక్రయాలు జరిపే వీలుంటుందని చెప్పటం తగదని మార్కెట్ కార్యద ర్శి రాఘవేందర్‌రావుతో వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిడ్డింగ్‌ను తాము అంగీకరించేది లేదని స్పష్టం చేశారు.