అనంతపురం జిల్లా గ్రామసభలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అనంతపురం: అనంతపురం జిల్లా గ్రామసభలో ఓ వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాండ్లపెంట మండలం సోమయాజులపల్లిలో మంగళవారం మధ్యాహ్నం గ్రామసభ ప్రారంభమైంది.
ఇన్‌పుట్ సబ్సిడీ జాబితాలో తమ కుటుంబసభ్యుల పేర్లు లేకపోవడంతో ఎర్రచేనుపల్లి గ్రామానికి చెందిన డేరంగుల ప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గ్రామసభలో ప్రదర్శించిన జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మనస్తాపం చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నించాడు. తాము వైఎస్సార్‌సీపీ మద్దతుదారులమైనందువల్లే తమ పేర్లు తొలగించారని ప్రసాద్ ఆరోపించాడు. వెంటనే అక్కడున్నవారు అతని ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు.


