breaking news
village meeting
-
మంత్రి నారాయణే ముంచేశాడు.. ప్రాణాలొదిలిన రైతు
సాక్షి, గుంటూరు: చంద్రబాబు సర్కార్.. రైతుల పాలిట శాపంగా మారింది. ఏపీ రాజధాని అమరావతి రైతు గుండెకోతను మిగిల్చింది. మందడం గ్రామసభలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. మంత్రి నారాయణ ఎదుటే తన ఆవేదనను వెళ్లగక్కిన రైతు రామారావు.. తమను నారాయణే ముంచేశాడంటూ వాపోయారు. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. కుప్పకూలిన రైతు.. మంత్రి నారాయణ చెప్పడం వల్లే వాగులో ప్లాట్లు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.‘‘ఇళ్లు తీసుకుంటానంటే తీసుకోండి. మాకు ఎక్కడ ఇస్తారంటే సీడ్ యాక్సెస్ రోడ్డులో ప్లాట్లు ఇవ్వండి. అమరావతికి మా పొలాలు ఇచ్చాం. సింగపూర్ వాళ్లకు ఇచ్చినదాంట్లోంచి మాకు 2 ఎకరాలు వాగులో ప్లాట్లు ఇచ్చారు. నారాయణ ఆర్డర్ అన్నారు. నారాయణ ఇవ్వమంటేనేగా వాళ్లు ఇచ్చింది..?. ఇంత లోతు నీళ్లు పడ్డాయి’’ అంటూ రైతు ఆవేదన చెందారు.అందరికీ సీడ్ యాక్సెస్ రోడ్లోనే స్థలాలు ఇవ్వాలన్న రైతు.. ముక్కలు ముక్కలుగా ప్లాట్లు ఇస్తే తమ గొంతు కోసినట్లు అవుతుందన్నారు. ఎమ్మెల్యే సర్ధి చెప్పబోయినా తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పి.. ఆ రైతు కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలిస్తుండగా రైతు రామారావు మృతిచెందారు. -
గ్రామసభలో ఆత్మహత్యాయత్నం
అనంతపురం: అనంతపురం జిల్లా గ్రామసభలో ఓ వ్యక్తి ఆత్మహత్య ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాండ్లపెంట మండలం సోమయాజులపల్లిలో మంగళవారం మధ్యాహ్నం గ్రామసభ ప్రారంభమైంది. ఇన్పుట్ సబ్సిడీ జాబితాలో తమ కుటుంబసభ్యుల పేర్లు లేకపోవడంతో ఎర్రచేనుపల్లి గ్రామానికి చెందిన డేరంగుల ప్రసాద్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గ్రామసభలో ప్రదర్శించిన జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో మనస్తాపం చెంది ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నించాడు. తాము వైఎస్సార్సీపీ మద్దతుదారులమైనందువల్లే తమ పేర్లు తొలగించారని ప్రసాద్ ఆరోపించాడు. వెంటనే అక్కడున్నవారు అతని ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు.


