'అభిమానులు 'లెజెండ్' స్క్రీన్ చించేశారు' | Fans teared Screen of Legend Movie | Sakshi
Sakshi News home page

'అభిమానులు 'లెజెండ్' స్క్రీన్ చించేశారు'

Mar 31 2014 6:18 PM | Updated on Aug 29 2018 1:59 PM

'అభిమానులు 'లెజెండ్' స్క్రీన్ చించేశారు' - Sakshi

'అభిమానులు 'లెజెండ్' స్క్రీన్ చించేశారు'

అభిమానులు ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తారో ఊహించడం కష్టం. అనంతపురంలో బాలకృష్ణ అభిమానులు వీరంగం సృష్టించారు.

అనంతపురం: అభిమానులు ఎప్పుడు, ఎలా ప్రవర్తిస్తారో ఊహించడం కష్టం. అనంతపురంలో బాలకృష్ణ అభిమానులు వీరంగం సృష్టించారు. ఇటీవల విడుదలైన 'లెజెండ్' చిత్రం అనంతపురంలోని 'గుర్నాథ్ థియేటర్'లో ప్రదర్శిస్తున్నారు. థియేటర్ లోని సౌండ్ సిస్టమ్ లో సాంకేతికపరమైన తలెత్తడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
పదే పదే విజ్క్షప్తి చేసినా థియేటర్ యాజమాన్యం సౌండ్ సిస్టమ్ ను బాగు చేయకపోవడంతో అభిమానులు సీట్లు విరగకొట్టి, స్క్రీన్ చించి గందరగోళం సృష్టించారు.. అభిమానుల గందరగోళంపై థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ సంఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement