పురావస్తు శాస్త్రవేత్త ఐ.కె.శర్మ మృతి | famous archaeologist I.K. Sarma is no more | Sakshi
Sakshi News home page

పురావస్తు శాస్త్రవేత్త ఐ.కె.శర్మ మృతి

Nov 29 2013 3:49 AM | Updated on Sep 2 2017 1:04 AM

పురావస్తు శాస్త్రవేత్త ఐ.కె.శర్మ మృతి

పురావస్తు శాస్త్రవేత్త ఐ.కె.శర్మ మృతి

ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, భారత పురావస్తు శాఖ పూర్వ డెరైక్టర్ ఇంగువ కార్తికేయ శర్మ (ఐ.కె.శర్మ) (76) గురువారం ఉదయం హైదరాబాద్‌లోని (విద్యానగర్) తన ఇంట్లో కన్నుమూశారు.

సాక్షి, హైదరాబాద్: ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, భారత పురావస్తు శాఖ పూర్వ డెరైక్టర్ ఇంగువ కార్తికేయ శర్మ (ఐ.కె.శర్మ) (76) గురువారం ఉదయం హైదరాబాద్‌లోని (విద్యానగర్) తన ఇంట్లో కన్నుమూశారు. ఆయనకు భార్య రాజేశ్వరి, కుమార్తెలు విమల, విజయ, కుమారుడు శివ ఉన్నారు. గురువారం సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరిగాయి.
 
 శర్మ మృతిపట్ల కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్ ఆర్. కృష్ణయ్య, రాష్ట్ర పురావస్తుశాఖ పూర్వ డెరైక్టర్ పి. చెన్నారెడ్డి, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డెరైక్టర్ ఈమని శివనాగిరెడ్డి పలువురు సీనియర్ ఆర్కియాలజిస్ట్‌లు సంతాపం తెలిపారు. శ్రీశైలం డ్యాం నిర్మాణం నేపథ్యంలో ముంపునకు గురైన కూడలి సంగమేశ్వర-పాపనాశి ఆలయ సముదాయాలను పరిరక్షించి ఆలంపురం తదితర ప్రాంతాలలో పునఃప్రతిష్ట చే యడంలో ఐ.కె.శర్మ కీలక పాత్ర పోషించారు. కార్తికేయ శర్మ మృతి పట్ల పురావస్తు శాఖ అధికారులు, సిబ్బంది, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement