నాగరాజు అనే మాజీ మావోయిస్టును పోలీసులు తీసుకెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: నాగరాజు అనే మాజీ మావోయిస్టును పోలీసులు తీసుకెళ్లారని ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా ఓదెల గ్రామానికి చెందిన నాగరాజు గతంలో దళంలో పనిచేశారని, కానీ గత ఆరు నెలలుగా మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో ఇంటివద్దనే ఉంటున్నాడని వారు తెలిపారు. గతంలో ఒకసారి ఆయనను అరెస్టు చేసిన పోలీసులు, తాజాగా గురువారం మరోసారి తీసుకెళ్లారన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న నాగరాజును వెంటనే విడుదల చేయాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు, పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శ పిలకా చంద్రశేఖర్ తదితరులు డిమాండ్ చేశారు.