అధినేతకు అధికారం.. కార్యకర్తలకు హత్యలు..

Every Time The TDP Comes to Power, The Party Leaders are Being Driven to Political Murders - Sakshi

సాక్షి, గుంటూరు: టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ఆ పార్టీ నాయకులు రాజకీయ హత్యలకు తెగబడుతున్నారు. 1995 నుంచి 2004 వరకు తొమ్మిదేళ్లు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఫ్యాక్షన్‌తో పల్నాడు ప్రాంత గ్రామాలు అట్టుడికిపోయాయి. 2004లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పదేళ్లపాటు ఆ గ్రామాలు ఫ్యాక్షన్‌కు దూరంగా ప్రశాంతంగా ఉన్నాయి. పదేళ్ల తరువాత 2014లో అధికారంలోకి వచ్చామనే గర్వంతో అడ్డగోలుగా దాడులు చేస్తూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసి ప్రతిపక్షమే లేకుండా చేయాలనే కుయుక్తులు పన్నుతున్నారు. 

జిల్లాలో టీడీపీ హత్యాకాండ ఇలా..
- 1999లో ఎన్నికల సందర్భంగా నరసరావుపేటలో కోడెల శివప్రసాదరావు ఇంట్లో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన బాంబులు పేలడంతో ఆయన అనుచరులు నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించడంతోపాటు, నరసరావుపేట ఎన్నిక సైతం వాయిదా పడింది. దీనిపై సీబీఐ విచారణ జరగకుండా అప్పట్లో కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలను పట్టుకుని బయటపడగలిగారు. 
- 2001 మార్చి 9వ తేదీన మాచర్ల నుంచి దుర్గి పోలీసు స్టేషన్‌కు బైండోవర్‌ సంతకాలు చేసేం దుకు వెళ్తున్న కాంగ్రెస్‌ వర్గీయులను టీడీపీ నాయకులు పక్కా పథకం ప్రకారం దుర్గి మండలం ఆత్మకూరు బోడు వద్ద బాంబులు, వేట కొడవళ్లతో దాడిచేసి ఏడుగురిని ఒకేసారి నరికి చంపారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచల నం కలిగించింది. పోలీసుల సాయంతో ఈ హత్యకు పథక రచన చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.    
- 2014 సెప్టెంబర్‌ 22న వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు పెద నాగిరెడ్డి, చిన నాగిరెడ్డిని అధికారపార్టీ నాయకులు హత్యచేశారు. 
- నీలగంగవరం గ్రామంలో రావులపల్లి పెదమునయ్యపై టీడీపీ వర్గీయులు దాడి చేసి గాయపరచడంతో అతను మృతి చెందాడు. తిరిగి వైఎస్సార్‌ సీపీకి చెందిన ముగ్గురు వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేయించారు. హత్య కేసుకు కౌంటర్‌ కేసు ఉంటే రాజీకి వస్తారన్న టీడీపీ నేతల దుర్మార్గపు ఆలోచనకు పోలీసులు వంతపాడారు.
- 2014 సెప్టెంబర్‌ 11వ తేదీన మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం చినగార్లపాడు గ్రామంలో వైఎస్సార్‌ సీపీ నాయకుడు వేంపాటి గోవిందరెడ్డి(45)ఇంటిపై టీడీపీ రౌడీలు మూకుమ్మడిగా దాడిచేశారు. గోవిందరెడ్డి పారిపోతుండగా వెంటాడి నడిరోడ్డు పొడిచి చంపారు. అడ్డు వచ్చిన ఆయన భార్య కోటేశ్వరమ్మను సైతం హతమార్చేందకు ప్రయత్నించారు. గోవిందరెడ్డిని హత్యచేస్తున్న సమయంలో పొలం నుంచి ఇంటికి వస్తున్న చింతలచెర్వు కోటిరెడ్డినీ హత్య చేసేందుకు యత్నిం చారు. కత్తి, బరిసె పోట్లకు గురైన ఆయన ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. 
-  2014 డిసెంబర్‌ 19న మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమహేశ్వరపాడుకు చెందిన వైఎస్సార్‌ సీపీ నేత గుడిపాటి వెంకట్రామయ్య కోర్టు వాయిదాకు వెళ్లి వస్తుండగా టీడీపీ వర్గీయులు గొడ్డళ్లు, కర్రలతో దాడి చేసి కిరాతకంగా చంపారు.
- 2013 సంవత్సరంలో కారంపూడి మండలం నరమాలపాడుకు చెందిన వైఎస్సార్‌ సీపీ నేత పెద వెంకటేశ్వర్లు(బ్రహ్మం)ను టీడీపీ వర్గీయులు నరికి చంపారు. 
- 2017 డిసెంబర్‌లో మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గంగలకుంటకు చెందిన వైఎ స్సార్‌ సీపీ నేత కంచర్ల సాంబయ్యను టీడీపీ వర్గీయులు వేట కొడవళ్లతో నరికి చంపారు. 
- వేమూరు నియోజకవర్గం పెరవలిపాలెంలో సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమి చెందిన ఎస్‌.ప్రభాకరరావుపై టీడీపీకి చెందిన సర్పంచ్‌ సాంబశివరావు వర్గీయులు 30 మంది దాడి చేసి కొట్టడంతో ఆయన మృతిచెందాడు.  

మరిన్ని వార్తలు

17-03-2019
Mar 17, 2019, 12:58 IST
సాక్షి, ఇడుపులపాయ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను ఆదివారం ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలోని...
17-03-2019
Mar 17, 2019, 12:48 IST
సాక్షి, కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ పార్లమెంట్‌ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఖరారైన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌కు హ్యాట్రిక్‌ ఓటమి తప్పదని...
17-03-2019
Mar 17, 2019, 12:47 IST
సాక్షి, అమరావతి బ్యూరో: సార్వత్రిక ఎన్నికల్లో యువతరం ఓట్లు కీలకంగా మారాయి. జిల్లాలో గెలుపోటములను శాసించే స్థితిలో ఉన్న యువత...
17-03-2019
Mar 17, 2019, 12:42 IST
సాక్షి, గుంటూరు: తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారం అండతో హత్యారాజకీయాలకు తెగబడుతున్నారు. పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్సార్‌...
17-03-2019
Mar 17, 2019, 12:32 IST
కర్ణాటక సరిహద్దున ఉన్న దుర్గాల్లో రాయదుర్గం చారిత్రాత్మకమైనది. విజయనగర రాజుల పాలనా వైభవానికి, నాటి శిల్పకళా నైపుణ్యానికి చిహ్నంగా నిలిచిన...
17-03-2019
Mar 17, 2019, 12:29 IST
సాక్షి, అనంతపురం: అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం శుభపరిణామమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ...
17-03-2019
Mar 17, 2019, 12:29 IST
సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 175మంది అభ్యర్థుల జాబితాను ఒకేసారి ప్రకటించి.....
17-03-2019
Mar 17, 2019, 12:22 IST
సాక్షి, కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఐదేళ్ల టీడీపీ పాలన జిల్లాలో రౌడీ రాజ్యాన్ని తలపిస్తోంది. అధికార బలంతో తెలుగు దేశం నేతలు అరాచకాలకు...
17-03-2019
Mar 17, 2019, 12:14 IST
వన్‌టౌన్‌(విజయవాడ పశ్చిమ): ప్రతిసారి కొత్త అభ్యర్థిని ఎన్నుకోవడం పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల ప్రత్యేకత. ఇక్కడ ఒకసారి గెలిచిన వారికి మరుసతి...
17-03-2019
Mar 17, 2019, 11:55 IST
సాక్షి, శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం వైకుంఠపురం సమీపంలో ఉన్న కొండప్రాంతంలో ఒడిశా  రాష్ట్రానికి చెందిన 10గిరిజన కుటుంబాలను వైకుంఠపురం గ్రామానికి...
17-03-2019
Mar 17, 2019, 11:51 IST
సాక్షి వెబ్‌ ప్రత్యేకం (భోపాల్‌): కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలకు చిరునామా అని కాంగ్రెస్‌ను ఎద్దేవా చేసే కమలనాథులు ఇప్పుడు స్వరం మార్చి...
17-03-2019
Mar 17, 2019, 11:42 IST
సాక్షి, ఆళ్లగడ్డ : నియోజకవర్గంలోని శిరివెళ్ల మండలం గోవిందపల్లెకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఇందూరు ప్రభాకరరెడ్డి, ఆయన బావమర్ది శ్రీనివాసరెడ్డి ప్రత్యర్థుల...
17-03-2019
Mar 17, 2019, 11:35 IST
సాక్షి, బోట్‌క్లబ్‌: ముందుగొయ్యి.. వెనుక నుయ్యి చం దంగా తయారయ్యింది కాకినాడ సిటీలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వనమాడి కొండబాబు పరిస్థితి....
17-03-2019
Mar 17, 2019, 11:35 IST
సాక్షి, అనంతపురం: రుణమాఫీ అనగానే రైతులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారు. రుణమాఫీ హామీ ప్రకటించే నాటికి రుణాలు...
17-03-2019
Mar 17, 2019, 11:24 IST
సాక్షి, ఎచ్చెర్ల క్యాంపస్‌ : శ్రీకాకుళం జిల్లా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. జిల్లా విద్యార్థులు ఉన్నత విద్యభ్యాసానికి గ్రామీణ విశ్వవిద్యాలయం ఏర్పాటు...
17-03-2019
Mar 17, 2019, 11:04 IST
సాక్షి, అమరావతి :‘‘ఆహా.. మన ఎలక్షన్లు మొదటివిడతే అయిపోవడం ఎంత లాభం తెలుసా?’’ అన్నాను నేను.   ‘‘ఏం లాభం.. ఎవరికి...
17-03-2019
Mar 17, 2019, 10:59 IST
సాక్షి, అనంతపురం అర్బన్‌ : ప్రజాస్వామ్యంలో ఓటు అమూల్యమైనది. ప్రజావ్యతిరేక పాలకుల పాలిట సింహ స్వప్నం. అవినీతి ప్రభుత్వాలను కూకటివేళ్లతో పెకిలించే...
17-03-2019
Mar 17, 2019, 10:48 IST
సాక్షి, ఆకివీడు : ముఖ్యమంత్రి చంద్రబాబు తీరువల్లే కొల్లేరు సమస్య పరిష్కారం కావడం లేదని, దీనికోసం ఈ సర్కారు తీసుకున్న ప్రత్యేక...
17-03-2019
Mar 17, 2019, 10:46 IST
సాక్షి,  అమరావతి :ఎన్నికలు దగ్గరపడటంతో ప్రజలకు పెద్ద నోట్లు లభించడం లేదు. ఓట్ల కొనుగోలు కోసం రాజకీయ నాయకులు పెద్ద నోట్లను...
17-03-2019
Mar 17, 2019, 10:43 IST
సాక్షి, కాకినాడ: అమలాపురం లోక్‌సభ స్థానానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా చింతా అనురాధ పేరును పార్టీ అధిష్టానం శనివారం రాత్రి...

మరిన్ని ఫొటోలు

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top