ఖాళీ ఖజానా - ముళ్ల కిరీటం : చంద్రబాబు | Empty treasury - barbed wire crown: Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సీఎం పదవి ముళ్ల కిరీటం:చంద్రబాబు

Jun 16 2014 3:07 PM | Updated on Sep 2 2017 8:54 AM

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

సీఎం పదవి పూల కిరీటం కాదని, ముళ్ల కిరీటం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.

చిత్తూరు: సీఎం పదవి పూల కిరీటం కాదని, ముళ్ల కిరీటం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.  ఖాళీ ఖజానా ఇచ్చారు, జీతాలు ఇవ్వడానికి కూడా నిధులు లేవని వాపోతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు.  రాష్ట్రాభివృద్ధి కోసం మీ ఆశీస్సులు కావాలని ప్రజలను కోరారు.

రామకుప్పంలో ఈరోజు చంద్రబాబు పలు ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కుప్పంలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందన్నారు. బోరులు ఎండిపోయాయని చెప్పారు. నీరు-మీరు లాంటి పనులు ద్వారా భూగర్భ నీటిమట్టాన్ని పెంచుతామన్నారు. డ్వాక్రా రుణాలు, రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement