ముగిసిన వెబ్ కౌన్సెలింగ్ గడువు | EAMCET's online process close | Sakshi
Sakshi News home page

ముగిసిన వెబ్ కౌన్సెలింగ్ గడువు

Sep 16 2013 9:44 AM | Updated on Jul 11 2019 6:33 PM

గత అర్థరాత్రితో ఇంజినీరింగ్, బీ ఫార్మసీలో ప్రవేశానికి వెబ్ కౌన్సెలింగ్‌కు గడువు ముగిసింది.

హైదరాబాద్ : గత అర్థరాత్రితో  ఇంజినీరింగ్, బీ ఫార్మసీలో ప్రవేశానికి వెబ్ కౌన్సెలింగ్‌కు గడువు ముగిసింది. ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం 1,30,289 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాగా.. వీరిలో 1,28,716 మంది మాత్రమే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు సీట్ల కేటాయింపు జాబితా వెలువడుతుంది.

 ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికిగాను ఐసెట్-2013లో అర్హత సాధించి ర్యాంకు పొందిన వారు లక్షా 21వేల మంది ఉండగా.. కౌన్సెలింగ్‌కు సగం మంది ర్యాంకర్లు మాత్రమే హాజరయ్యారు.  సర్టిఫికెట్ల పరిశీలన గడువు ముగిసింది. అయితే ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దాదాపు లక్షా 20వేలు అందుబాటులో ఉన్నాయని ఐసెట్ అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement