విశాఖపట్నం మాజీ మేయర్, ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు డి.వి.సుబ్బారావు అంత్యక్రియలు
విశాఖపట్నం: విశాఖపట్నం మాజీ మేయర్, ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడు డి.వి.సుబ్బారావు అంత్యక్రియలు ఆదివారం అధికార లాంఛనాలతో నిర్వహించారు. నగర డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగోపాల్‌నాయక్ డీవీ ఇంటి వద్ద గౌరవ వందనం చేశారు. పోలీస్ బ్యాండ్ ఎస్కార్ట్‌తో పూలర థంపై డీవీ పార్థివ దేహాన్ని తరలించారు.
విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ వద్ద ఉన్న హిందూ శ్మశాన వాటికలో ఆయన తనయుడు సోమయాజులు చితికి నిప్పంటించారు. అంత్యక్రియల సమయంలో పోలీసులు గౌరవ సూచకంగా వందన సమర్పణ చేసి గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. పలువురు ప్రముఖులు డీవీ అంత్యక్రియలకు హాజరయ్యారు.