ఏపీడీఎస్‌సీ ఫలితాలు విడుదల | DSC Merit Results Released By Ganta Srinivasa Rao | Sakshi
Sakshi News home page

ఏపీడీఎస్‌సీ ఫలితాలు విడుదల

Feb 15 2019 4:56 PM | Updated on Feb 15 2019 5:09 PM

DSC Merit Results Released By Ganta Srinivasa Rao - Sakshi

సాక్షి, రాజమండ్రి: ఏపీడీఎస్‌సీ మెరిట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం మంత్రి గంటా శ్రీనివాసరావు రాజమండ్రిలో డీఎస్‌సీ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ.. 7,902 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేయగా, 6,08,155 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారిలో 85 శాతం మంది పరీక్షలకు హజరయ్యారని వెల్లడించారు. 

పరీక్షలు నిర్వహించిన 110 రోజుల్లోనే ఫలితాలు ప్రకటిస్తున్నామని చెప్పారు. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు ఎంపికైన టీచర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. జూన్ 12న టీచర్లు విధుల్లో చేరుతారని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement