‘5 - 10కి కక్కుర్తిపడితే విలువ పోతుంది’ | Dont involve in Land disputes says ChinaRajappa to police | Sakshi
Sakshi News home page

పోలీసులంటే గౌరవం ఉండాలి : చినరాజప్ప

Dec 25 2018 4:33 PM | Updated on Dec 25 2018 7:20 PM

Dont involve in Land disputes says ChinaRajappa to police - Sakshi

సాక్షి, కాకినాడ : కానిస్టేబుళ్లు ఐదు, పదిరూపాయలకు కక్కుర్తిపడితే విలువ పోతుందని పోలీస్‌ సిబ్బందికి ఏపీ హోంమంత్రి చినరాజప్ప క్లాస్‌ తీసుకున్నారు. పోలీసుల సంఘం అభినందన సభకు హాజరైన చినరాజప్ప.. భూతగాదాల్లో పోలీసులు తలదూరిస్తే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే అనేక ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయన్నారు. రౌడీయిజం, భూతగాదాలు, మైనింగ్, ఇసుక వివాదాల్లో తప్పు జరిగితే ఊరుకోవద్దని దిశా నిర్దేశం చేశారు. రౌడీయిజాన్ని ఇంకా అణిచివేయాలని సూచించారు. పోలీసులకు ప్రభుత్వం మంచి జీతం ఇస్తుందని చినరాజప్ప అన్నారు. పోలీసులంటే గౌరవం ఉండాలని, ఇప్పటీకే పోలీసు స్టేషన్‌లలో మంచి కుర్చీలు, టేబుళ్లు, ఏసీలు కూడా వేస్తున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement