చెన్నై నుంచి గాడిదల రవాణా.. ఆందోళనలో ప్రజలు | Sakshi
Sakshi News home page

చెన్నై నుంచి గాడిదల రవాణా.. ఆందోళనలో ప్రజలు

Published Mon, Jun 22 2020 8:27 AM

Donkey Transport From Chennai To Prakasam District - Sakshi

సాక్షి, ఒంగోలు: చెన్నై నుంచి మండలానికి పశువుల రవాణా జరుగుతుండటంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కాలంలో చెన్నై నుంచి వస్తున్న వారితో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో ఇక్కడి అధికారులు చెన్నై నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. కానీ ఆదివారం చెన్నై నుంచి గాడిదలను లారీలో తీసుకుని కందుకూరు జంక్షన్‌ ఫ్లైఓవర్‌ వద్ద కొంతమంది వ్యక్తులు వాటిని లారీ లోంచి దింపారు.

అయితే వారు మాత్రం ఈ గాడిదలను ఆటోలో కనిగిరి ప్రాంతానికి తరలిస్తామని చెబుతుండగా, ఇది అవాస్తవమని ఇటీవల కాలంలో గాడిద మాంసం అమ్మకాలు మండల కేంద్రంలో జోరుగా జరుగుతున్నాయని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యేక పెట్రోలింగ్‌ ఏర్పాటు చేసి ఇటువంటి పశువుల రవాణాను అడ్డుకుని, కరోనా వైరస్‌ ప్రబలకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. చదవండి: మాతృదేవతా మన్నించు!  

  

Advertisement

తప్పక చదవండి

Advertisement