డీఈఓ బదిలీ..? | District education officer's transfer | Sakshi
Sakshi News home page

డీఈఓ బదిలీ..?

Jan 12 2014 4:36 AM | Updated on Sep 2 2017 2:31 AM

జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాధ్‌రెడ్డి బదిలీ అవుతున్నట్లు తెలిసింది. ఆయనను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రాజీవ్ విద్యామిషన్ పీఓగా నియమించేందుకు రాష్ట్ర విద్యాశాఖ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

ఖమ్మం, న్యూస్‌లైన్: జిల్లా విద్యాశాఖ అధికారి రవీంద్రనాధ్‌రెడ్డి బదిలీ అవుతున్నట్లు తెలిసింది. ఆయనను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు రాజీవ్ విద్యామిషన్ పీఓగా నియమించేందుకు రాష్ట్ర విద్యాశాఖ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. జిల్లా విద్యాశాఖ అధికారిగా రాష్ట్ర విద్యాశాఖలో డిప్యూటీ డైరక్టర్‌గా పని చేస్తున్న బుచ్చన్నను నియమిస్తున్నట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముమ్మరం కావడం, ఏలూరు ఆర్‌వీఎం పీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో తనను అక్కడికి బదిలీ చేయాలని డీఈఓ నెల రోజుల క్రితం ఉన్నతాధికారులకు విన్నవించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనను బదిలీ చేసేందుకు రాష్ట్ర విద్యాశాఖ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం.
 

Advertisement
 
Advertisement
Advertisement