తొక్కించేస్తా.. తొక్కేస్తా... చింతమనేని వీరంగం | Denduluru TDP MLA candidate Chinthamani Prabhakar take on Voters | Sakshi
Sakshi News home page

తొక్కించేస్తా.. తొక్కేస్తా... చింతమనేని వీరంగం

Published Tue, Apr 29 2014 9:58 AM | Last Updated on Tue, Aug 14 2018 5:54 PM

తొక్కించేస్తా.. తొక్కేస్తా... చింతమనేని వీరంగం - Sakshi

తొక్కించేస్తా.. తొక్కేస్తా... చింతమనేని వీరంగం

‘ఎవరైనా ఎదురు తిరిగితే తొక్కించేస్తా.. తేడాలొస్తే నేనే తొక్కేస్తా...’ అంటూ దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఓటర్లపై విరుచుకుపడ్డారు.

ఓటర్లపై చింతమనేని చిందులు
 
పెదపాడు : ‘ఎవరైనా ఎదురు తిరిగితే తొక్కించేస్తా.. తేడాలొస్తే నేనే తొక్కేస్తా...’ అంటూ దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఓటర్లపై విరుచుకుపడ్డారు. పెదపాడు శివారు కేఆర్ పాలెంలో ఆదివారం రాత్రి ప్రచారానికి వచ్చిన ఆయన దుర్భాషలాడటంతో ఓటర్లు నిర్ఘాంతపోయూరు. ఓట్లు అభ్యర్థించడం మానేసి ‘నాకు వ్యతిరేకంగా పోటీ చేయడానికి గుంటూరు నుంచి వచ్చాడొకడు. వేరే చోటనుంచి తయూరయ్యూడు మరొకడు. వాళ్లు డబ్బులిస్తే తీసుకోండి. ఓటును మాత్రం నాకే వేయం డి’ అంటూ చింతమనేని ప్రసంగిస్తుండగా.. ఇదేమిటని ఓ ఓటరు ప్రశ్నించాడు.
 
దీంతో రెచ్చిపోయిన చింతమనేని ‘నాకే ఎదురు చెబుతావా. ఎవడ్రా నువ్వు.. నిన్ను తొక్కించేస్తా.. తొక్కేస్తా. ఎవరైనా ఎదురుతిరిగితే ఇదేగతి’ అంటూ చిం దులు తొక్కారు. ‘అలా అంటారేంటి బాబూ’ అని ఓ మహిళ ప్రశ్నించగా.. ‘నువ్వెవరు.. ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తోందా..’ అంటూ దుర్భాషలాడారు. ఓటమి భయంతోనే చింతమనేని ఈ విధంగా మాట్లాడుతున్నారని మిగిలిన ఓటర్లంతా గుసగుసలాడుకోవడం కనిపించింది. మొత్తానికి చింతమనేని వ్యవహార శైలి విమర్శలకు దారితీస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement