శ్రీకాళహస్తిలో ఓ ప్రార్థనా మందిరం వరండాను అక్రమంగా నిర్మిస్తున్నారని బుధవారం మునిసిపల్ అధికారులు కూల్చివేశారు.
శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తిలో ఓ ప్రార్థనా మందిరం వరండాను అక్రమంగా నిర్మిస్తున్నారని బుధవారం మునిసిపల్ అధికారులు కూల్చివేశారు. ఫలితంగా పట్టణంలో ఉద్రి క్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కొందరు యువకులు వెళ్లి మునిసిపల్ కమిషనర్ చాంబర్‌పై దాడిచేసి తలుపులు పగులగొట్టారు. ఈ సందర్భంగా వారిలోనే ఇద్దరు గాయపడ్డారు. మరో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో మరింత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వెంటనే వారిని పోలీసులు వదిలిపెట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
శ్రీకాళహస్తి పట్టణంలోని పూసలవీధిలో నూతనంగా నిర్మిస్తున్న ఓ ప్రార్థనామందిరం దాదాపుగా పూర్తయింది. బుధవారం ఉదయం మునిసిపల్ కమిషనర్ శ్రీరామ్‌శర్మ సిబ్బందితో కలసి వెళ్లి ఆక్రమణలో ఉందంటూ ఆ ప్రార్థనామందిరం వరండాను కూల్చివేశారు. దీంతో జనం ఆగ్రహించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వరండాను ఎలా కూల్చివేరంటూ నిలదీశారు. మురుగుకాలువపై వరండా నిర్మించారని.. ఆక్రమణను తొలగించడానికి నోటీసులు ఇవ్వాల్సిన పనిలేదంటూ అధికారులు సమాధామిచ్చారు. ఇటు వైపు వంద ఇళ్లు, అటు వైపు వంద ఇళ్లకు పైగా కాలువపైనే వరండాలు నిర్మించారని, వాటిని పట్టించుకోకుం డా ఈ వరండానే కూల్చడం దారుణంటూ మండిపడ్డా రు. దీంతో పెద్ద ఎత్తున వాగ్వివాదం చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో జనం అక్కడి చేరుకున్నారు. అరుపులు కేకలతో గందరగోళంగా మారింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కమిషనర్‌పై దాడి జరిగే అవకాశాలు చోటుచేసుకున్నాయి.
కమిషనర్, సిబ్బంది జేసీబీని వదిలిపెట్టి కార్యాలయానికి వెళ్లిపోయారు. తర్వాత జనం జేసీబీ డ్రైవర్‌తో వాగ్వివాదానికి దిగారు. ‘మీకు ఆలయాలు ఎంత పవిత్రమో... మాకు మా ప్రార్థనా మందిరాలు అం తే పవిత్రం... అలాంటిది ఎలా కూల్చివేస్తావ్’ అం టూ జేసేబీని అడ్డుకున్నారు. పొరబాటైం ది.. వదిలిపెట్టండి ప్లీజ్ అంటూ బతిమాలడంలో అతడిని వదిలిపెట్టారు. తర్వాత పెద్ద ఎత్తున మున్సిపల్ కార్యాలయం వద్దకు వెళ్లారు. కమిషనర్‌తో వాగ్వివాదానికి దిగారు. మరోవైపు దాదాపు 10మంది యువకులు కమిషనర్ చాంబర్‌పై దాడిచేసి తలుపులు పగులగొట్టారు. ఈ సందర్భంగా వారిలోనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రక్తపు మరకలతో కార్యాలయం తడిసింది. పోలీసులు అక్కడికి చేరుకున్నారు.
దాడికి పాల్పడిన వారిలో ఏడుగురిని అదుపులోకి తీసుకోగా, మిగిలినవారు పరారయ్యారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటకిషో ర్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. కమిషనర్ పరిస్థితిని వివరించారు. మరోవైపు మహిళలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. వరండాను కూల్చడంతో పాటు కమిషనర్ తమవారిపై దౌర్జన్యం చేశారని, వాటిని పట్టించుకోకుండా తమ పిల్లలు మున్సిపల్ కార్యాల యంపై దాడిచేశారంటూ అదుపులోకి తీసుకోవడం ఎం తవరకు న్యాయమని డీఎస్పీని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డిని కూడా జనం నిలదీశారు.
పరిస్థితి విషమిస్తున్నట్లు గుర్తించిన డీఎస్పీ వెంటనే అదుపులో ఉన్న ఏడుగురిని వదిలిపెట్టారు. దీంతో వారు శాంతించి వెళ్లిపోయారు. ఇలా నాలుగు గంటలపాటు మున్సిపల్ కార్యాలయం వద్ద గందరగోళం ఏర్పడింది. తర్వాత డీఎస్పీ మైనారిటీల నాయకులు సిరాజ్‌బాషా, గోరా, జానీబాషా, బషీర్, షాకీర్‌ఆలీ, గోస్‌బాషా తదితరులతో చర్చించారు. శాంతియుత వాతావరణం కోసం తమతో సహకరించాలని కోరారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తొలగిపోయాయి.
కమిషనర్‌పై పోలీసులకు ఫిర్యాదు
వరండా కూల్చివేత పై బుధవారం రాత్రి పలువురు వన్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మున్సిపల్ కమిషనర్ శ్రీరామ్‌శర్మపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఆ మేరకు వన్‌టౌన్ సీఐ చిన్న గోవింద్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.