ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతికలోపం | Delhi-bound Air India flight makes emergency landing at shamshabad airport | Sakshi
Sakshi News home page

ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతికలోపం

Oct 23 2013 10:56 AM | Updated on Aug 17 2018 6:15 PM

చెన్నై నుంచి బుధవారం ఉదయం న్యూఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది.

చెన్నై నుంచి బుధవారం ఉదయం న్యూఢిల్లీ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. దాంతో విమానంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని విమాన పైలెట్లు చెన్నై ఎయర్పోర్ట్ అధికారులకు వివరించారు. దాంతో వారు హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులను సంప్రదించారు.

 

చెన్నై- న్యూఢిల్లీ విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దించేందుకు అధికారులు అంగీకరించారు. దాంతో ఆ విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దింపేశారు. విమానంలో 80 మంది ప్రయాణీకులు సురక్షితంగా ఉన్నారు. వారిని మరో విమానంలో న్యూఢిల్లీ పంపేందుకు విమానాశ్రయ అధికారులు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement