మొన్న రోజా - నేడు శాంతి! | day before yesterday Roja - Today Santi | Sakshi
Sakshi News home page

మొన్న రోజా - నేడు శాంతి!

Jan 6 2015 2:48 AM | Updated on Sep 2 2017 7:15 PM

రోజా-శాంతి

రోజా-శాంతి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు రక్షణ లేదని చిత్తూరు జిల్లా నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కె రోజా అన్నారు.

 నగరి(చిత్తూరు జిల్లా): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో మహిళలకు రక్షణ లేదని చిత్తూరు జిల్లా నగరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కె రోజా అన్నారు. నగరి మున్సిపల్ చైర్‌పర్సన్‌ శాంతిపై సోమవారం దాడి జరిగిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ చైర్‌పర్సన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కె. శాంతిపై తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నేత ముద్దు కృష్ణమ నాయుడు వర్గీయులు సోమవారం దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో ఆమె దుస్తులు చిరిగిపోయాయి. కుడి చేతికి గాయమైంది.

గతంలో జాతర సమయంలో తనపై దాడి జరిగితే, ఇప్పుడు  చైర్‌పర్సన్‌పై దాడి జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్యే ముద్దుకష్ణమ నాయుడు దిగజారుడు రాజకీయాలే ఈ దాడులకు కారణమన్నారు. స్మగ్లర్లను ఆయన తన అదుపులో ఉంచుకుని ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ దాడులకు చంద్రబాబు నాయుడు ఏం సమాధానం చెబుతారని రోజా ప్రశ్నించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement