చిత్తూరు జిల్లా: పుత్తూరు మున్సిపాలిటీలో 99 శాతం అభివృద్ధి పనులు వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగా చేశామని మాజీ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. 35-40 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ నాయకులమని చెప్పుకునే వాళ్లు ఏమీ చేయలేదని అన్నారు. కరోనా సమయంలో ఎన్నో కీలకమైన పనులు చేసినట్లు వివరించారు.
చిత్తూరు జిల్లాలో రోజా మీడియాతో మాట్లాడుతూ... ‘పుత్తూరులో అందమైన షాదీమహల్ నిర్మించాం. అది పూర్తయినా ప్రారంభించకుండా నిర్లక్ష్యంగా ఉంచారు. జగనన్న పాలనలో మూడేళ్లలో నాలుగు అర్బన్ హెల్త్ సెంటర్లు నిర‍్మించాం. పుత్తూరు ప్రభుత్వ హాస్పిటల్‌ను ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం.
ఎమ్మెల్యే గాలి భానుకు ఫేస్ వాల్యూ లేదు. మున్సిపల్ కమిషనర్, పోలీసుల్ని పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారు. జనసేన పార్టీ నాయకులు దిగజారి మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడున్నారు? ఉగాది పండగకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కొండపై లేరు. జనసేనలో క్యారెక్టర్ లేని వాళ్లతో మాట్లాడిస్తున్నారు. వాళ్ల బ్రతుకులు ప్రజలకు తెలుసు.. అది జనసేన కాదు కామసేన.
మేము అధికారంలోకి వచ్చాక అద్బుతమైన పార్కులు నిర్మించాం. గతంలో పుత్తూరులో ప్రభుత్వ హస్పిటల్ నిర్మాణానికి నిధులువస్తే టీడీపీ నాయకులు కుట్రచేసి అడ్డుకున్నారు. పుత్తూరులో ఎలా గెలిచారో ప్రజలకు తెలుసు. పెన్షన్, రేషన్ కోసం గంటలు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. సున్నావడ్డీ రుణాలు ఇవ్వకుండా మహిళల్ని కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. చంద్రబాబు సిగ్గు లేకుండా ఉగాది రోజు అబద్ధాలు చెబుతున్నారు. ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన చెబుతున్నారు.
తిరుమలను అపవిత్రం చేస్తున్నారు. పుట్టా సుధాకర్ కొడుకు పుట్టా మహేష్ డ్రగ్ వ్యవహారంలో దొరికారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలు ఆడుతూ వీడియోతో సహా బయటపడ‍్డారు. ఆయనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. వెంకటేశ్వరస్వామి అందరి లెక్కలను తేల్చేస్తారు. మనం చూస్తూ ఉంటే చాలు.
రేణిగుంట నుంచి పుత్తూరు వరకు జాతీయ రహదారి పూర్తి అయ్యేందుకు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేశాం. పుత్తూరు నుంచి నగరి వరకు రద్దు అయిన రోడ్డు టెండర్లు పూర్తి చేశాం’ అని రోజా అన్నారు.


