దళితులపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని కోరుతూ విశాఖ జిల్లా చోడవరంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.
చోడవరంలో దళిత సంఘాల ఆందోళన
Dec 29 2015 12:47 PM | Updated on Sep 3 2017 2:46 PM
చోడవరం: దళితులపై దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని కోరుతూ విశాఖ జిల్లా చోడవరంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మండల వ్యాప్తంగా ఉన్న దళితులంతా మంగళవారం మధ్యాహ్నం చోడవరం తరలివచ్చారు. ఇటీవల తురువోలు గ్రామంలో దళితులపై దాడికి పాల్పడిన వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం బీఎన్‌రోడ్డులో రాస్తారోకోకు దిగారు. దీంతో పెద్ద సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం భారీ బహిరంగ సభ నిర్వహించారు.
Advertisement


