
తుపానుపై అప్రమత్తం
తీవ్ర తుపాను హెచ్చరికలతో జిల్లా యంత్రాం గం అప్రమత్తమైంది. నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలకు సన్నద్దమవుతోంది.
- కలెక్టరేట్‌లో కంట్రోలు రూం ఏర్పాటు
- రెండో ప్రమాద సూచిక ఎగురవేత
- వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం : తీవ్ర తుపాను హెచ్చరికలతో జిల్లా యంత్రాం గం అప్రమత్తమైంది. నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలకు సన్నద్దమవుతోంది. తుపాను ప్రభావం శుక్రవారం, శనివారం జిల్లాపై అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో జిల్లా కలెక్టరేట్‌లో 1800-4250-0002 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ తుపాను ముందస్తు చర్యలపై జిల్లా అధికారులకు బుధవారం సాయంత్రం ప్రత్యేక సూచనలు చేశారు. తీర ప్రాంత మండలాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తుపానుపై గురువారం సాయంత్రం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్‌లో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే పోర్టులో రెండో ప్రమాద సూచిక ఎగురవేశారు.మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచిం చింది. నగరంలోని ఈపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయంలో 24 గంటలూ అత్యవసర సేవలందించేం దుకు కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్టు పర్యవేక్షక ఇంజినీరు(ఎస్‌ఈ) సత్యన్నారాయణమూర్తి తెలిపారు.