మంత్రి ఇంటి ఎదుట ఆందోళన | cpi protest in ananthapuram distirict | Sakshi
Sakshi News home page

మంత్రి ఇంటి ఎదుట ఆందోళన

Apr 14 2015 11:19 AM | Updated on Jun 1 2018 8:54 PM

మంత్రి ఇంటి ఎదుట ఆందోళన - Sakshi

మంత్రి ఇంటి ఎదుట ఆందోళన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఇంటి ఎదుట సీపీఐ కార్యకర్తలు నిరసనకు దిగారు.

అనంతపురం టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి  పల్లె రఘునాథ రెడ్డి ఇంటి ఎదుట సీపీఐ కార్యకర్తలు నిరసనకు దిగారు. మంగళవారం పెద్ద ఎత్తున మంత్రి ఇంటి వద్దకు చేరుకున్నకార్యకర్తలు నిరసన ప్రదర్శన చేశారు. ఎచ్‌ఎల్‌సీ ఆధునికరణ పనులు వెంటనే చేపట్టాలని ఈ సందర్భంగా కార్యకర్తలు డిమాండ్ చేశారు. అనంతరం మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగా ఆయన నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు మంత్రి ఇంటి గోడలకు వినతిపత్రం పోస్టర్లను అంటించారు.

Advertisement
 
Advertisement
Advertisement