ఐటీ గ్రిడ్స్‌ స్కాం : సుప్రీం కోర్టు సుమోటోగా కేసు పెట్టాలి | CPI National Secretary Narayana Comments On IT Grids Scam | Sakshi
Sakshi News home page

ఐటీ గ్రిడ్స్‌ స్కాం : సుప్రీం కోర్టు సుమోటోగా కేసు పెట్టాలి

Mar 7 2019 12:26 PM | Updated on Mar 7 2019 12:26 PM

CPI National Secretary Narayana Comments On IT Grids Scam - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపుతున్న డేటా చోరీ అంశంపై సుప్రీం కోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డేటా చౌర్యం కచ్చితంగా క్రిమినల్‌ నేరమే అన్నారు. ఎన్నికల సంఘం దగ్గర మాత్రమే ఉండాల్సిన డేటా.. ప్రైవేట్‌ సంస్థల దగ్గర లభించడం దారుణమన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపించాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక శుక్తులతో కలిసి పోటీ చేస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement