నారాయణ సహా వామపక్ష నేతల అరెస్ట్ | cpi leader narayana and some other leaders are arrested | Sakshi
Sakshi News home page

నారాయణ సహా వామపక్ష నేతల అరెస్ట్

May 17 2017 12:39 PM | Updated on Jun 4 2019 5:16 PM

నారాయణ సహా వామపక్ష నేతల అరెస్ట్ - Sakshi

నారాయణ సహా వామపక్ష నేతల అరెస్ట్

రైతులను ఆదుకోవాలంటూ ధర్నా చేస్తున‍్న వామపక్షాల నేతలను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు.

అనంతపురం: కరువుతో సతమతమవుతున్న రైతులను ఆదుకోవాలంటూ అనంతపురం కలెక‍్టర్‌ కార్యాలయం వద‍్ద ధర్నా చేస్తున‍్న వామపక్షాల నేతలను బుధవారం మధ్యాహ‍్నం పోలీసులు అరెస్టు చేశారు. రాయలసీమ కరువు సమస‍్యల పరిష్కారానికి వామపక్షాలు 48 గంటల ఆందోళనకు పిలుపు ఇచ్చిన విషయం విదితమే. ఈ ఆందోళనలో భాగంగా బుధవారం సీపీఐ నేతలు నారాయణ, రామకృష‍్ణ, సీపీఎం ఏపీ కార‍్యదర్శి మధు తదితరులు పాల‍్గొన్నారు.

వామపక్ష నేతలు కలెక‍్టరేట్‌ ముట‍్టడికి ప్రయత్నించడంతో అక్కడ భారీ ఎత్తున పోలీసులు బలగాలను మోహరించారు. కలెక‍్టరేట్‌లోకి చొచ్చుకుపోతున‍్న వామపక్షాల నేతలు నారాయణ, రామకృష‍్ణ, మధు సహా వందలాది మంది కార్యాకర‍్తలను అదుపులో తీసుకున్నారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన నేతలను అరెస్ట్ చేసే క్రమంలో అక్కడ ఉద్రిక‍్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement