సీఎంఆర్‌ఎఫ్‌కు విరాళాల వెల్లువ

Coronavirus: Various People Donations To CM Relief Fund - Sakshi

► కరోనా విపత్తును ఎదుర్కొనేందుకుగాను సీఎం సహాయనిధికి రామోజీ ఫౌండేషన్‌ రూ.10 కోట్లు విరాళం ఇచ్చింది. 
► ఏపీ విద్యుత్‌ శాఖ ఉన్నతాధికారులు రూ.7.87 కోట్లు, ట్రాన్స్‌కో, జెన్‌కో, తూర్పు, దక్షిణ, కేంద్ర విద్యుత్‌ పంపిణీ సంస్థల ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా అందజేశారు. 
► దివీస్‌ ల్యాబ్‌ లిమిటెడ్‌ రూ.5 కోట్లు, ఎన్‌సీపీ లిమిటెడ్‌ రూ.కోటి అందజేశాయి. 
► ఏపీలోని పౌల్ట్రీ అసోసియేషన్‌లు, నేషనల్‌ ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (ఎన్‌ఈసీసీ) సభ్యులు కలిపి రూ.60 లక్షలు, గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలోని రాజధాని గ్రామమైన పెనుమాక నివాసి, రైతు కళ్లం నరేంద్రరెడ్డి రూ.1,00,116 విరాళం. 
సీఎంఆర్‌ఎఫ్‌కుగానూ సీఎస్‌కు రూ.5 కోట్ల చెక్‌ను ఇస్తున్న దివీస్‌ ల్యాబ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రకాష్‌ దివి, రూ.కోటి చెక్‌ను అందిస్తున్న ఎన్‌సీపీ లిమిటెడ్‌ సంస్థ సంచాలకులు ఎఆర్కే సూర్య 

► ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్స్‌ అసోసియేషన్‌ రూ.44 లక్షల 52 వేలు. 
► గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌)లో పనిచేసే ఎల్‌1, ఎల్‌2 కేటగిరి ఉద్యోగులతో పాటు మండల స్థాయి సమాఖ్యలో పనిచేసే సిబ్బంది మొత్తం తమ ఒక్క రోజు వేతనమైన రూ.33 లక్షలు విరాళమిచ్చారు. 
► గుంటూరు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు రూ.25 లక్షలు.
► కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లోని కాంట్రాక్ట్‌ రెసిడెంట్‌ టీచర్‌లు రూ.17 లక్షలు.
► పాపులర్‌ షూమార్ట్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్లు చుక్కపల్లి అరుణ్‌కుమార్, విజయ్‌కుమార్‌ రూ.10 లక్షల విరాళం ప్రకటించారు. ఈ మొత్తంలో సీఎం సహాయనిధికి రూ.5 లక్షలు, ప్రధానమంత్రి నిధికి రూ.5 లక్షలు అందజేశారు. 
► అనంతపురం జిల్లాలోని సప్తగిరి క్యాంపర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.5 లక్షలు. 
► శ్రీకాకుళం జిల్లాకి చెందిన యడ్ల గోపాలరావు రూ.2 లక్షలు, బగ్గు సరోజినీదేవి ఆసుపత్రి అధినేత డా.బగ్గు శ్రీనివాసరావు రూ.లక్ష, రాజాంకు చెందిన కల్కి జ్యుయెలరీ షాపు యజమాని కె.మధుసూదనరావు రూ.లక్ష విరాళమిచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top