ఏపీలో మరో మూడు కరోనా కేసులు | Coronavirus Positive Cases Rises To 135 In India | Sakshi
Sakshi News home page

ఏపీలో మరో మూడు కరోనా కేసులు

Apr 2 2020 4:38 PM | Updated on Apr 2 2020 7:22 PM

Coronavirus Positive Cases Rises To 135 In India - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో గురువారం ఉదయం 9 గంటల తర్వాత మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా సోకిన వారి సంఖ్య 135కు చేరింది. రాష్ట్రంలో పెరుగుతన్న కేసులను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఉన్న నాలుగు టెస్టింగ్‌ సెంటర్లతో పాటు మరో రెండు టెస్టింగ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు కడప, గుంటూరులలో ల్యాబ్స్‌ అందుబాటులోకి వచ్చాయి. విశాఖలో మరో టెస్టింగ్‌ ల్యాబ్‌ను సిద్ధం చేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన కొత్త టెస్టింగ్‌ సెంటర్లతో ప్రస్తుతం రోజుకు 450గా ఉన్న కరోనా టెస్ట్‌ల సంఖ్య 570కి చేరనుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement