ఏపీలో కొత్తగా 12 కరోనా కేసులు | Coronavirus Positive Cases Rise To 432 In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో కొత్తగా 12 కరోనా కేసులు

Apr 13 2020 11:35 AM | Updated on Apr 13 2020 11:47 AM

Coronavirus Positive Cases Rise To 432 In Andhra Pradesh - Sakshi

సాక్షి, విజయవాడ : ఆంద్రప్రదేశ్‌లో కొత్తగా మరో 12 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 432కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర నోడల్‌ అధికారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేశారు. ఆదివారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 9 గంటల వరకు జరిగిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో.. గుంటూరు జిల్లాలో 8, చిత్తూరులో 2, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్క కేసు నమోదైందని తెలిపారు. ఏపీలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న 12 మంది డిశ్చార్జ్‌ అయ్యారని, ఏడుగురు మృతిచెందారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 413 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని చెప్పారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement